హన్సిక విదేశీ టూర్ వెనక సీక్రెట్ :సినీ జ్వాల తెలుగు:

Posted on

హన్సిక హఠాత్తుగా విదేశాలుకు ప్రయాణం అవటం ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఆంటిలా తయారైన హన్సిక ‘కందిరీగ’ చిత్రంలో అభిమానులను సైతం భయపెట్టింది. ఇదే విషయం అందరూ మాట్లాడుతూండటంతో ఆమెకు కంగారు మొదలైంది. వెంటనే ఆ కొవ్వుని కరిగించుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే ఆమె విదేశ ప్రయాణం అంటున్నారు. అర్జెంటుగా సన్నబడేందుకు బాడీకి సంబంధించి కాస్మొటిక్‌ సర్జరీ చేయించుకుంటోందని చెప్పుకుంటున్నారు.ఇక ‘కందిరీగ’హిట్టవటం ఆమెకు ఆనందాన్ని కలిగించింది. అదే విషయం ప్రస్దావిస్తూ.. అమ్మ కూడా చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఆచితూచి సినిమాలు ఒప్పుకుంటున్నాను. నాకిపుడు జస్ట్ ట్వంటీ. సో... ఇంకా పదేళ్ల పాటు టాప్ హీరోయిన్‌గా కెరీర్ సాగించగలననే నమ్మకం నాకుంది అని మురిసిపోతూ చెప్పింది.‘కందిరీగ’లోని తన పాత్రకు మంచి స్పందన వస్తోందని, ఈ విజయం తాను ముందే ఊహించానంది అంది. మొత్తానికి త్వరలో బాగా సన్నబడ్డ హన్సికను చూడబోతున్నామన్నమాట.మరి సన్నబడితే తమిళ తంబీలు ఎలా ఫీలవుతారో చూడాలి.