హన్సిక.. నువ్వు తప్ప నాకు వేరే వాళ్ళు…….:సినీ జ్వాల తెలుగు:

Posted on

హన్సిక.. నువ్వు తప్ప నాకు వేరే వాళ్ళు నా మనస్సులో లేరు.. నువ్వే నా ప్రాణం. నిన్ను చూస్తే చాలు నన్ను నేను మర్చిపోతాను అంటూ ఓ వ్యక్తి గత కొంత కాలంగా హన్సికను సతాయిస్తున్నాడు ట్విట్టర్ లో. అంతేగాకుండా తన ట్వీట్స్ కి సమాధానం ఇవ్వమని వేదించటంతో ఆమెకు ఏం చెయ్యాలో పాలుపోలేదు. దాంతో ఆమె ఆ వ్యక్తిని బ్లాక్ చెయ్యాలని నిర్ణయించుకుంది. అయితే అతను మరో పేరుతో ట్విట్టర్ లోకి రాడని, వేధించడని నమ్మకం లేదు. దాంతో అతనికి ఫైనల్ గా ఓ వార్నింగ్ తరహా ఇచ్చింది.. నువ్విలా కంటిన్యూగా ఇలాంటి ట్వీట్స్ చేస్తూంటే నేను బ్లాక్ చేస్తాను. కానీ ఇది నీ కోసమే. నువ్వు నీ ధ్యాస వదిలి నీకు, నీ కుటుంబానికి పనికొచ్చాలే పని చేయి. నువ్వు చదువుమీద, నీ కుటుంబం మీద దృష్టి పెట్టు అంటూ ట్వీట్ చేసింది. దానికి అతను సమాధానంగా కాళ్ల బేరానికి వచ్చి.. హన్సూ.. ప్లీజ్ నన్ను బ్లాక్ చెయ్యకు.. నాకు నువ్వు తప్ప వేరే లోకం లేదు.

కానీ ఇక నుంచి నువ్వు చెప్పినట్లుగానే చదువుకుంటాను. అలాంటి ట్వీట్స్ చెయ్యను. నన్ను బ్లాక్ చెయ్యకు అంటూ బ్రతిమాలాడాడు. మరి ఈ చివరకు ఈ కథ ఏ కంచికి చేరుతుందో కానీ హన్సిక మాత్రం మానసికంగా చాలా ఇబ్బంది పడింది ఈ ట్వీట్స్ వల్ల అని ఆమె సన్నిహితులు చెప్తున్నారు. కానీ స్టార్ డమ్ వచ్చాక అలాంటి తలనొప్లులు తప్పవనేది నిజం. అందులోనూ సాంకేతికంగా చాలా అభివృద్ది చెందిన ఈ రోజుల్లో అయితే ఇలాంటి సమస్యలు మరీ పెరిగిపోతాయి. ఇక హన్సిక ప్రస్తుతం తాను నటించిన ఓ మై ప్రెండ్ చిత్రం విడుదల కోసం ఎదురుచూస్తోంది. ఆమె తమిళంలో చేసిన వేలాయిధం చిత్రం మంచి హిట్ టాక్ తెచ్చుకుంది.