కొత్త హాబీ సరదాగా వుందంటున్న రామ్ చరణ్ :సినీ జ్వాల తెలుగు:

Posted on

హీరో రాం చరణ్ కి మొదటి నుంచీ హార్స్ రైడింగ్ అంటే మహా ఇష్టం. చిన్నప్పుడే గుర్రపు స్వారీ చేయడం నేర్చుకున్నాడు. చెన్నయ్ లో వున్న రోజుల్లో తండ్రి చిరంజీవి తనే స్వయంగా చరణ్ ని హార్స్ రైడింగ్ ప్రాక్టీస్ కి తీసుకెళ్ళేవారు. హైదరాబాదు వచ్చాక చరణ్ హార్స్ రైడింగ్ లో మరింత ప్రావీణ్యం సంపాదించాడు. ఇక విషయానికొస్తే, తాజాగా చరణ్ కి మరో హాబీ అలవాటైందట. అదే... పోలో గేమ్. ఈమధ్య ఏ మాత్రం  ఖాళీ దొరికినా ఈ ఆట మీదే దృష్టి పెడుతున్నాడు. పోలో ఆడుతుంటే చాలా సరదాగా వుందని చరణ్ చెబుతున్నాడు కూడా. అలా తను పోలో ఆడేటప్పటి ఫోటోని ట్విట్టెర్ లో పోస్ట్ చేశాడు. పోలో ఆడాలంటే హార్స్ రైడింగ్ కూడా వచ్చుండడం తప్పనిసరి కాబట్టి, చరణ్ త్వరలోనే ఈ గేమ్ లో కూడా పట్టు సంపాదిస్తాడేమో చూడాలి!