ట్రెంట్ బ్రిడ్జ్ టెస్టులో టీమిండియా బౌలర్లు ఇరగదీశారు. తొలి మ్యాచ్ లో భారీ విజయం సాధించిన ఇంగ్లండ్ జట్టును 221 పరుగులకే ఆలౌట్ చేశారు. ఇషాంత్, శ్రీశాంత్, ప్రవీణ్ తలా మూడు వికెట్లు తీయగా.. చివర్లో గట్టి పోరాటం చేసిన బ్రాడ్ వికెట్‌ను హర్భజన్ తన ఖాతాలో వేసుకున్నాడు. తొలిరోజు ఆట ముగిసేసరికి భారత్.. వికెట్ నష్టానికి 24 రన్స్ చేసింది. లార్డ్స్ టెస్టులో ఎదురైన పరాభవమో లేక నంబర్ వన్ స్థానానికి ముప్పు పొంచి ఉందన్న భయమో తెలియదు కానీ… ట్రెంట్‌బ్రిడ్జ్ టెస్టులో టీమిండియా బౌలర్లు సత్తా చాటారు.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్‌కు… ముగ్గురు సీమర్లు మంచి ఆరంభాన్నిచ్చారు. ఆరో ఓవర్లోనే ఓపెనర్ కుక్‌ను ఇషాంత్ అవుట్ చేసి ఇంగ్లండ్ పతనానికి శ్రీకారం చుట్టగా.. శ్రీశాంత్, ప్రవీణ్ తమ వంతు పాత్ర పోషించారు.
ఒకదశలో 124 పరుగులకే 8 వికెట్లు పడగొట్టిన టీమిండియా బౌలర్లు.. ఎప్పటిలాగే టెయిలెండర్ల విషయంలో చేతులెత్తేశారు. ఫలితంగా ఆల్ రౌండర్ స్టూవర్ట్ బ్రాడ్ రెచ్చిపోయాడు.
తొలిరోజు ఆట ముగిసే సమయానికి భారత్ వికెట్ నష్టానికి 24 పరుగులు సాధించింది. రెండో రోజు.. మిగతా బ్యాట్స్‌మెన్ సక్సెస్ అయి.. భారీ స్కోరు సాధిస్తే.. ఈ మ్యాచ్ లో విజయం సాధించడం.. భారత్‌కు పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు…