ప్రముఖ నటి రోజా భర్త ఆర్.కె.సెల్వమణి గుర్తున్నాడు కదా... కెప్టెన్ ప్రభాకర్, చామంతి వంటి చిత్రాలను రూపొందించిన దర్శకుడాయన. ఇప్పుడీ దర్శకుడు తొలిసారిగా కెమెరా ముందుకు వస్తున్నాడు. అంటే... నటిస్తున్నాడన్నమాట! ఆయన దర్శకత్వంలోనే రూపొందుతున్న 'అఖిల' అనే చిత్రంలో సెల్వమణి ఓ ముఖ్యపాత్ర పోషిస్తున్నాడు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య బంధం ఎలా వుండాలి? అన్న పాయింట్ ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో ఆయన ప్రజల తరఫున పోరాడే వ్యక్తిగా ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు.
అయితే, ఈ పాత్ర చేయాలని మొదట్లో తాను అనుకోలేదనీ, తప్పని సరి పరిస్థితులలో మాత్రమే చేస్తున్నాననీ సెల్వమణి అంటున్నాడు. ఈ పాత్ర కోసం కొంత మంది ప్రముఖ నటులని సెల్వా సంప్రదించాడట. అయితే, వారంతా పాత్రకు సంబంధించి కొన్ని మార్పులు కోరారు. అది ఇష్టం లేక ఈ పాత్ర తానే చేస్తున్నానని సెల్వా చెబుతున్నాడు.