ఎట్టకేలకు కర్ణాటక ముఖ్యమంత్రి యాడ్యూరప్ప రాజీనామా చేశారు. లోకాయుక్త నివేదిక అందిన ఒకరోజు తర్వాత పంతం వీడి.. యాడ్యూరప్ప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఎన్ని ఆరోపణలు వచ్చినా.. వెనక్కి తగ్గని యాడ్యూరప్ప.. రాజీనామా చేయాలని అధిష్టానం నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో.. రాజీనామాకు ఒప్పుకున్నారు. బెంగళూరులోని తన నివాసంలో.. ఎమ్మెల్యేలు, మంత్రులతో.. సమావేశమయ్యారు. తన అనుచరులతో సుదీర్ఘ మంతనాలు చేసిన ఆయన.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరీకి రాజీనామా లేఖను పంపారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరేకే రాజీనామా చేస్తున్నానని..
యాడ్యూరప్ప ప్రకటించారు. మరోవైపు శుక్రవారం కర్ణాటక బీజేఎల్పీ సమావేశం కానుంది. కొత్త సీఎం ఎన్నికపై చర్చలు జరపనుంది. దీనిపై పార్టీ అధిష్టానం పరిశీలకులుగా.. రాజ్ నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ వ్యవహరిస్తున్నారు. కాగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా సదానంద్ గౌడ్ పేరును యాడ్యూరప్ప అధిష్టానానికి ప్రతిపాదించారు. జగదీష్ షెట్టర్, అనంతకుమార్ పేర్లను పరిశీలించవద్దని ఆయన కోరారు. ఇదిలా ఉంటే.. సీఎం రేసులో ఉన్న మంత్రి సురేష్ కుమార్ కూడా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉన్నట్లు కథనాలు వస్తున్నాయి.