'ఓసారి షూటింగ్‌లో గాయపడి కొంతకాలం గ్యాప్ తీసుకొన్నా. ఆ ఖాళీ సమయంలో భాగ్యరాజా సినిమాలు ఎక్కువగా చూసే అవకాశం వచ్చింది. 'అరె.. ఈ కథలు నాకు బాగా నప్పుతాయి కదా..' అనిపించింది. వాటిని రీమేక్ చేయాలన్న ఆలోచన వచ్చింది. అలా రీమేక్‌లుగా వచ్చిన ప్రతి సినిమా బాగా ఆడింది. నాకు మంచి పేరు తీసుకొచ్చింది. గాయం కూడా మంచిదే అనే నిజం ఆ రూపంలో తెలిసింది'' అంటూ స్పందించారు వెంకటేష్.‘కలియుగ పాండవులు’తో ప్రారంభమైన వెంకటేష్ సినీ ప్రస్థానం నేటికి 25ఏళ్లు పూర్తయ్యింది.ఆ సందర్బంగా మాట్లాడుతూ ఇలా స్పందించారు.
ఇక తన తాజా చిత్రం బాడీగార్డు రీమేక్ గురించి చెబుతూ..''ఓ అందమైన యువతికి బాడీగార్డ్ ఉంటే ఎలా ఉంటుందో నా కొత్త చిత్రంలో చూపిస్తున్నా. వినోదంతోపాటు సున్నితమైన ప్రేమకథ కూడా ఉంది. ఇదే కథ హిందీలో సల్మాన్‌ఖాన్ చేస్తున్నారు. నా పాత్రతో సల్మాన్‌తో పోలిక పెట్టదలుచుకోలేదు. నాదంతా వేరే తరహా. ఈ సినిమా పేరు ఇంకా ఖరారు చేయలేదు. మీడియా ఏవేవో పేర్లు ప్రచారం చేస్తోంది. మహేష్‌బాబుతో కలిసి ఓ సినిమా చేసే ఆలోచన ఉంది. ఆ కబుర్లు త్వరలోనే చెబుతాను. త్రివిక్రమ్‌తో సినిమా చేయాలని ఉన్నా వీలుకావడం లేదు. తను కూడా బిజీగా ఉన్నాడు'' అని చెప్పుకొచ్చారు.