టాలీవుడ్ లో నెంబర్ వన్ ఎవరు……?:సినీ జ్వాల తెలుగు:

Posted on

చిరంజీవి సినిమా లకు కాస్త దూరంగా ఉండటం తో తెలుగు తెరపై నేను నెంబర్ వన్ అంటే నేను నెంబర్ వన్ అని కొంత మంది హీరోలు చంకలు గుద్దుకుంటున్నారు.ఇంతకీ నెంబర్ వన్ హీరో ఎవరు? చిరంజీవి స్థానాన్ని భర్తీ చేసే సత్తా ఎ హీరోకు ఉంది. పవన్, రామ్ చరణ్, అల్లు అర్జున్, జూ ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్ వంటి హీరోలు ఉన్న వీరిలో ఎవరు నెంబర్ వన్ స్తానాన్ని దక్కించుకుంటరనేదే ప్రశ్న. బహుశా వీరిలో ఎవరూ కాదనేది సినిమా వర్గాల అభిప్రాయం.

ఎందుకంటే చిరంజీవి కష్ట పడినంతగా ఇప్పుడున్న హీరోలు ఎవరు కష్ట పడరు. అలు పెరుగని కృషీవలుడు చిరంజీవి. చిరంజీవి సాధించిన మెగాస్టార్ స్థానం సామాన్య మైనది కాదు. అసాధారణమైనది. చిరంజీవి రాజకీయాలలోకి ప్రవేశించడంతో సినిమా రంగంలో చిరంజీవి స్థానం ప్రస్తుతం నివ్వెరపోయిఉంది. ఆ స్థానాన్ని వేరెవ్వరూ అర్హులు కారు. చిరంజీవికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మరే హీరోకు లేదనే చెప్పాలి.

శ్రమైక్య జీవన సౌందర్యాన్ని విశ్వసించే మెగాస్టార్ చిరంజీవి, చెమటోడ్చి కష్టపడడంలోనే విశ్రాంతిని పొందుతారు. కష్టించడంలోని సుఖమేమిటో తెలుసుకున్న వాడినని ఆయన కించిత్తు భావోద్వేగంతో చెప్పుకుంటుంటారు. ఒక ప్రొజెక్ట్ విఫలమైనపుడు ఆ అపజయంలో తన ప్రధాన భాగస్వామ్యాన్ని తరచి చూసుకుంటానని, పునరావృతం కాకుండా మెలకువలు పాటిస్తానని ఆయన చెబుతుంటారు. అదే ఆయన్ని ఈ స్థితిలో నిటబెట్టిందంటే ఏమాత్రం అతిశయోక్తి కాదేమో…వాణిజ్యవిలువలున్న చిత్రాలు చేస్తూనే కాసింత సందేశాన్ని అందించేందుకు ఆయన పాత్రలు ప్రయత్నించాయి. స్వయం కృషి వంటి సినిమాలు చేసే సత్తా ఇప్పటి హీరోలకు లేదు. కాబట్టి హీరోలు కొందరు నెంబర్ వన్ స్టార్స్ అనే భ్రమలో పడి సినిమా టైటిల్ కార్డ్ లో వేసుకోవడం తప్ప ఆ స్థానాన్ని భర్తీ చేసే హీరో లేడనే చెప్పాలి.