యాక్షన్* ఇమేజ్* నుంచి బైటపడడానికి, కుటుంబ కథలతో సైతం గోపి ఆకట్టుకోగలడని నిరూపించడానికే ఈ సరికొత్త ప్రయత్నం చేశాను. అది సత్ఫలితం ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ప్రస్తుతం అమ్మాయిలంతా అచ్చం మీలాంటి మొగుడు కావాలి అంటున్నారు’’ అన్నారు గోపిచంద్*. ఈ యువహీరో కథానాయకుడుగా నటించిన చిత్రం ‘మొగుడు’. తాప్సీ, శ్రద్ధాదాస్* కథానాయికలు. డా రాజేంద్రప్రసాద్* కీలక పాత్రధారి. కృష్ణవంశీ దర్శకత్వం వహించారు. లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్* పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్* (బుజ్జి) నిర్మించారు. ఇటీవల రిలీజైన ఈ చిత్రం విజయవంతంగా కొనసాగుతున్న సందర్భంగా గోపీచంద్* సూర్య సినిమాతో ముచ్చటిస్తూ ..పైవిధంగా స్పందించారు. మరిన్ని సంగతులు చెబుతూ-‘‘నా గత చిత్రాలు ఇచ్చిన ఇమేజ్*నుంచి బైటికి తెచ్చిన చిత్రమిది. కృష్ణవంశీ శైలిలో తెరకెక్కి మహిళలు సహా అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోంది. నటుడిగా..వంశీ నుంచి ఎన్నో విషయాలను నేర్చుకున్నా. అలాగే నిజజీవితంలో బైట ఎలా ఉంటానో..అచ్చం అలాంటి పాత్రనే ఈ సినిమాలో చేశాను. అక్కచెల్లెళ్లతో గొడవపడడం..తండ్రితో స్వేచ్ఛగా ఉండే తనయుడిగా.. చిన్నపిల్లాడి మనస్తత్వంతో కనిపించే పాత్రలో నటించాను. నా ఇమేజ్* బ్రేక్* చేయడానికి దర్శకుడే నా పాత్రను అలా మలిచారు. డారాజేంద్రప్రసాద్*తో నా కాంబినేషన్*లోని సన్నివేశాలు విశేషమైన ఆదరణ పొందు తున్నాయి. తనతో కలిసి నటించడమంటే తొలుత భయ పడ్డాను. ఆయన ఇచ్చిన స్వేచ్ఛతో చాలా సహజంగా నటించగలిగాను. పరిధి మేర శ్రద్ధాదాస్*, నటనకు ఆస్కారమున్న పాత్రలో అందాల తార తాప్సీ ఆకట్టుకునే ప్రతిభను చూపారు. నిర్మాత అభిరుచితో ఈ సినిమాని ఎక్కడా రాజీలేకుండా తెరకెక్కించారు’’ అన్నారు. హీరోగారూ..మీ పెళ్లెప్పుడు అన్న ఓ ప్రశ్నకు సమాధానంగా..‘‘పిల్లని వెతుకుతున్నా’’! అన్నారు గోపీచంద్*. ‘‘ప్రస్తుతం అందమైన అమ్మాయిలు ..ఫోన్లు చేసిమరీ అచ్చం మీలాంటి మొగుడు కావాలి అని అడుగుతున్నారు. హైదరాబాద్* నందగిరి హిల్స్*లో ప్రస్తుతం ఓ ఇల్లు కట్టుకుంటున్నా. అది పూర్తయితే పెళ్లే. ప్రస్తుతం పిల్లను వెతికే పనిలోనే ఉన్నా’’ అన్నారు గోపీచంద్*.