గత కొద్ది రోజులుగా అనేక మలుపులు తిరుగుతున్న కర్నాటక రాజకీయాల అనిశ్చితికి నేడు తెరపడింది. మైనింగ్ అక్రమాలలో కర్నాటక సి.ఎం. యడ్యూరప్ప హస్తం ఉందని లోకాయుక్త తేల్చడంతో యడ్యూరప్ప సి.ఎం. పదవికి గండం ఏర్పడింది. తన పదవిని కాపాడుకోవడం కోసం యడ్యూరప్ప ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఆదివారం ఉదయం యడ్యూరప్ప తన రాజీనామా పత్రాన్ని పార్టీ అధ్యక్షుడు గడ్కరీకి పంపారు. మధ్యాహ్నం మూడున్నరకు గవర్నర్ భరద్వాజ్‌ను కలవడానికి అపాయింట్ మెంట్ కూడా తీసుకున్నారు.
మరోవైపు CM పీఠం తాను సూచించిన వ్యక్తికే ఇవ్వాలని పట్టుబడుతూ.. ఇప్పటికే అధిష్టానానికి కొన్ని పేర్లు సిఫార్సు చేశారు యడ్యూరప్ప. విశ్వసనీయ సమాచారం ప్రకారం సదానంద గౌడకే CM అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.