క్షమాపణ చెప్తాను వదిలేయండి - ప్రియమణి :సినీ జ్వాల తెలుగు:

Posted on

నేనంత విశ్వాసం లేనిదాన్ని కాదు. ఆ గాసిప్స్‌ని పట్టుకొని నన్ను అనటం పద్దతికాదు. అవసరమైతే చేయని తప్పుకు క్షమాపణ చెప్పుకోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను అంటూ ప్రియమణి తాజాగా మీడియాకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఆమె ఆ మధ్య ఇక తమిళ సినిమాలు చేయనని చెప్పిందంటూ మీడియాలో కథనాలు వచ్చాయి.ఆగ్రహించిన తమిళ చిత్ర పరిశ్రమ ఆమెపై బ్యాన్ పెట్టడానికి రెడీ అయ్యింది. ఈ నేఫద్యంలో ఆమె ఇలా స్పందించింది. దాంతో ఇలా వివరణ ఇస్తూ తన ఆవేదనను వ్యక్తం చేసింది.

అయినా తమిళ సినీ పెద్దలు ఆమెను వదిలేటట్లు లేరు. చాలా పట్టుదలగా ఆమెను నిషేధించాలని నిర్ణయించుకున్నారు.దాంతో ప్రియమణి తనకు తెలిసి ఉన్న తమిళ నిర్మాతలు, దర్శకులకు ఫోన్స్ చేసి మరీ తన గోడు వెళ్లబోసుకుంటోంది. కొందరు హీరోలను సైతం ఆమె పర్శనల్ గా కలిసి తనను ఈ సమస్య నుంచి ఒడ్డున పడేమని కోరటం జరిగింది. తెలుగులో ప్రస్తుతం ఆపర్స్ లేని ఆమె తమిళంలోనూ పరిస్ధితి తిరగబడితే కెరీర్ అంతమైనట్లే అని భావించి ఇలా వెంటనే నివారణ చర్యలకు దిగింది. చివరకు ఈ ఇష్యూ ఏ మలుపు తీసుకుంటుందో చూడాలి.