ప్రొడక్షన్‌ వైపు చూపు :సినీ జ్వాల తెలుగు:

Posted on

నిన్నటితరం బాలీవుడ్‌ అందాల భామ హేమమాలిని కుమార్తెగా సినీ ప్రవేశం చేసిన ఇషా డియోల్‌, ఆశించిన రీతిలో హీరోయిన్‌గా నిలదొక్కుకోలేక పోయింది. తల్లి పేరు చెప్పుకుని అడపా దడపా ఇంకా అవకాశాలు సంపాదించుకుంటోన్న ఇషా డియోల్‌, ఇకపై ఎక్కువగా సినిమాల్లో నటించలేనని తేల్చసింది. ప్రస్తుతం ప్రొడక్షన్‌, డైరెక్షన్‌ వంటి విభాగాలపై ఇషా ఎక్కువ ఫోకస్‌ పెట్టిందట. డైరెక్షన్‌, ప్రొడక్షన్‌ విభాగాల్లో పరిణతి సాధించేందుకుగాను విదేశాలకు వెళ్లనున్న ఇషాడియోల్‌, అడపా దడపా సినిమాల్లో నటించే అవకాశం లేకపోలేదని చెప్పింది. ‘టెల్‌ మీ ఓ ఖుదా’ సినిమాతో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైయ్యిందిప్పుడు. డైరెక్టోరియల్‌ వెంచర్‌ 2012 చివర్లో వుంటుందని ఇషా ప్రకటించేసింది కూడా !