జీతాలు ఖచ్చితంగా ఇస్తాం : బొత్స :సినీ జ్వాల తెలుగు:

Posted on

హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికులకు కొద్దిగా ఆలస్యంగా అయినా జీతాలు ఖచ్చితంగా చెల్లిస్తామని పీసీసీ అధ్యక్షుడు,రవాణాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ హామీ ఇచ్చారు. మంగళవారం సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో కొత్త బస్సులను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆర్టీసీపై మోటార్ వెహికల్స్ ట్యాక్స్ భారం పడకుండా రూ.450 కోట్లు రాయితీ ఇప్పించామన్నారు. ఆర్థిక మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీని ఆదుకునేందుకు ఆర్థిక శాఖ ఎప్పుడూ ముందు ఉంటుందన్నారు.కాగా  ఆర్టీసీ కార్మికులకు అక్టోబరు నెలకు సంబంధించిన వేతనాలను నవంబరు 1, 2 తేదీల్లో చెల్లిస్తామని ఆర్టీసీ ఎండీ ప్రసాదరావు తెలిపారు. వేతనాలు చెల్లించేందుకు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేవని ఆయన తెలిపారు.