ప్రస్తుతం తమిళంలో 'రౌథిరం' చిత్రంలో కథానాయికగా నటిస్తున్న డిల్లీ భామ శ్రియా, మరో తమిళ సినిమాలో ఐటెం సాంగ్ చేయడానికి ఒప్పుకుందని తాజా సమాచారం. గత ఏడాది హిందీలో బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచిన 'దబాంగ్' సినిమాని తమిళంలో 'ఓస్తీ' పేరుతో రీమేక్ చేస్తున్నారు. శింబు, రిచాగంగోపాద్యాయ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో ఐటెం సాంగ్ చేయడానికి శ్రియా సైన్ చేసిందని అంటున్నారు.
దబాంగ్ లోని 'మున్నీ బద్నాం హుయీ' సాంగ్ ఎంతగా పాప్యులర్ అయిందీ మనకు తెలుసు. ఇప్పుడీ ఐటెం సాంగ్ కూడా అదే రేంజ్ లో ఉంటుందట. అందుకే, ఎంతో మందిని పరిశీలించిన మీదట చివరికి శ్రియాని ఎంపిక చేసుకోవడం, ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయట.