ఏభై కోట్లు తీసుకుంటున్న కథానాయకుడు :CineJwala Telugu:

Posted on

పారితోషికం విషయంలో ఇన్నాళ్లూ కాస్త లిబరల్ గా కనిపించిన బాలీవుడ్ కథానాయకుడు సల్మాన్ ఖాన్, ఇప్పుడు తను కూడా  షారుక్, ఆమిర్ ఖాన్ లలా పట్టు బిగించాడు. గత ఏడాది 'దబాంగ్', ఈ ఏడాది 'రెడీ' సినిమాలతో సక్సెస్ లో వున్న సల్మాన్, తన పారితోషికాన్ని ఒక్కసారిగా 50 కోట్లకు పెంచేశాడని ముంబై సమాచారం. నిన్నటి వరకు 40 కోట్ల వరకు తీసుకున్న సల్మాన్, ఇటీవల రిలీజ్ అయిన 'రెడీ' హిట్ తో మరో పది కోట్లు పెంచాడట. అయినా కూడా అతని సినిమాలకు సేలబిలిటీ ఉండడంతో నిర్మాతలు ఎగబడుతున్నారు.



అలాగే, కొత్త సినిమాలు ఒప్పుకోవడంతో పలు కండిషన్లు కూడా పెడుతున్నాడని అంటున్నారు. తన సినిమాకు దర్శకుడిని రికమెండ్ చేయడంతో బాటు, హీరోయిన్ని కూడా అతనే సజెస్ట్ చేస్తాడు. అలా తన షరతులకు సై అనే వాళ్లకే సినిమాలు చేస్తున్నాడు.