ఫలించిన బాలీవుడ్ ప్రయత్నాలు :CineJwala Telugu:

Posted on

మోహన్ బాబు కూతురు లక్ష్మీ ప్రసన్న ఇప్పుడు ఆనందంతో ఎగిరిగంతేస్తోంది. బాలీవుడ్ సినిమాలో నటించాలన్న తన చిరకాల కోరిక త్వరలో తీరుతోంది. రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్ చేయనున్న 'డిపార్ట్ మెంట్' హిందీ సినిమాలో ఓ ముఖ్యపాత్రకు ఆమె ఎంపికైంది. దీనికి సంబంధించి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల ముంబైలో ఆమెతో ఫోటో షూట్ కూడా చేయించారు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్ర పోషిస్తాడు. సంజయ్ దత్, రానా తదితరులు ఇతర పాత్రలు పోషిస్తారు.




ఈ సినిమా షూటింగును వచ్చే నెలాఖరులో ప్రారంభించడానికి వర్మ సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ సినిమా హిట్ అయితే, ఇక లక్ష్మీ ప్రసన్న బాలీవుడ్ లో సెటిల్ అయ్యే అవకాశం వుంది!