చిరంజీవి 150వ సినిమా జూ.ఎన్టీఆర్ చేతుల్లోకి? :సినీ జ్వాల తెలుగు:

Posted on

‘బుడ్డా హోగా తెరా బాప్’ ప్రీమియర్ షో సందర్భంగా...చిరంజీవి ఒప్పుకుంటే ఆయనతో 150 సినిమా చేసి పెడతా, తన వద్ద స్క్రిప్టు కూడా రెడీగా ఉందని పూరీ జగన్నాథ్ ప్రకటించడం, అమితాబ్ గెస్ట్ రోల్ చేస్తానంటే తాను సిద్ధమే అని చిరంజీవి మాటివ్వడం జరిగింది. గెస్ట్ రోల్ చేయడానికి ఆ క్షణమే అమితాబ్ ఒప్పుకున్న సినిమా మాత్రం ఇంత వరకు ట్రాక్ ఎక్కలేదు కదా..కనీసం దాని ఊసుకూడా ఇప్పటి వరకు మళ్లీ రాలేదు.

అయితే విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం చిరంజీవి పూరి సినిమా తీయడం లేదని తెలుస్తూంది. చిరంజీవి 150వ సినిమా కోసం పూరి తను తయారు చేసిన స్క్రిప్టుతో ఎన్టీఆర్ తో సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడు. రాజీకీయాలతో బిజీగా ఉన్న చిరంజీవి బాగా ఆసల్యం చేస్తుండటమే ఇందుకు కారణమట. జూనియర్ ఎన్టీఆర్ కూడా గత కొన్ని రోజుల నుంచి పూరి తనతో సినిమా చేయాలని ఒత్తిడి తెస్తున్నాడట. చిరు కోసం తయారు చేసుకున్న కథ ఎన్టీఆర్ కు సూటయ్యే విధంగా ఉండటంతో పూరి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

గతంలో కూడా...చిరంజీవి కోసం తయారు చేసిన ‘ఆంధ్రావాలా’ కథను తాను దక్కించుకుని దెబ్బ తిన్న ఎన్టీఆర్ మరి ఈ సారి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన బోతున్నాడో?