కొంత కాలం క్రితం రవితేజ,విజయ్ భాస్కర్ దర్సకత్వంలో ‘పూల రంగడు’ అనే టైటిల్ తో ఓ చిత్రం ప్లాన్ చేసారు. అయితే అది రవితేజ ఆసక్తి చూపకపోవటంతో మెటీరియలైజ్ కాలేదు. ఆ తర్వాత ఆ విషయం అంతా మర్చిపోయారు. ఇప్పుడు మళ్ళీ అదే మ్యాటర్ తెరపైకి వచ్చింది.సునీల్,వీరభద్రచౌదరి కాంబినేషన్ లో రూపొందే చిత్రానికి ఈ టైటిల్ ని పెట్టి పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారారు. సునీల్ హీరోగా వీరభద్రం చౌదరి దర్శకత్వంలో మ్యాక్స్ ఇండియా పతాకంపై అచ్చిరెడ్డి నిర్మిస్తున్న చిత్రానికి అనూప్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈరోజే చిత్రం ప్రారంభం కానుంది.
ఇక 1967లో ‘పూల రంగడు’ పేరుతో సీనియర్ నటుడు డా.అక్కినేని నాగేశ్వరరావు ఓ చిత్రాన్ని చేశారు. ఆ తర్వాత ఇదే పేరుతో నటుడు రాజేంద్రప్రసాద్ హీరోగా ఓ చిత్రం వచ్చింది. ముచ్చటగా మూడోసారి ఇప్పుడు మళ్ళీ అదే టైటిల్‌తో సునీల్ ప్రేక్షకుల ముందుకు రాబోతుండటం విశేషంగా చెప్పుకుంటున్నారు. మొదటి సినిమాకు అహనాపెళ్ళంట అనే టైటిల్ పెట్టి వెలకమ్, మ్యారియింగ్ మ్యాఫియా వంటి చిత్రాలలో ని సీన్స్ ని డైరక్ట్ లిఫ్ట్ చేసిన దర్శకుడు ఈ సారి టైటిల్ దగ్గరనుండి ఇలా తీసుకుని మళ్లీ ఏ హిందీ సినిమాను లేపబోతున్నాడనే చర్చ మొదలైంది.