తనపై వస్తున్నవన్ని రూమర్సేనని, తాను తమిళ హీరో శరత్ కుమార్ కూతురు వరలక్ష్మిని ప్రేమించలేదని హీరో విశాల్ స్పష్టం చేసారు. అయితే తాను ఆమెను గత ఇరవై ఏళ్లుగా ఎరుగుదునని అన్నారు.మేము జస్ట్ ప్రెండ్స్ మి మాత్రమే. మేమంతా ఎన్నో సార్లు డిన్నర్స్ కి కలిసి వెళ్ళాం.సినిమాలు కలిపి చూసాం. అయితే ఆ సమయంలో మేమిద్దరమే ఉండము.మా గ్యాంగ్ అంతా ఉంటుంది. అది గమనించిన వాళ్ళే అపార్ధం చేసుకుని ఉంటారనుకుంటున్నాను అని తేల్చి చెప్పాడు. అలాగే నేను ప్రస్తుతం సింగిల్ గానే ఉన్నాను. నాకు గర్ల్ ప్రెండ్ ఉంటే తప్పనిసరిగా ఆమె పేరు బయిటకి వస్తే సంతోషమే కానీ అస్సలు ఆ విధమైన రిలేషనే లేకుండా వార్తలు రావటం వింతగా ఉంది అన్నాడు. ఇక నా జీవితంలో ఏ అమ్మాయి లేదు అని స్పష్టం చేసాడు. వాడు వీడు చిత్రంలో చేసిన విశాల్ ప్రస్తుతం ఓ తమిళ సినిమాలో బిజీగా ఉన్నాడు. అలాగే శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి కూడా హీరోయిన్ గా ఓ చిత్రంలో చేస్తోంది.