పెళ్లైన హీరోయిన్ సెక్స్ సినిమా :సినీ జ్వాల తెలుగు:

Posted on

పెళ్లి చేసుకుని సెటిల్ అయిన సంగీత నటించిన ధనం సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రంలో సంగీత సెక్స్ వర్కర్ గా కనిపించనుంది. ఆమె ఈ చిత్రం గురించి చెపుతూ సినిమా రియలిస్టిక్ టచ్ కోసం కొన్ని సీన్స్ ని పెద్దాపురం,హైదరాబాద్ లోని కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపారు. ఈ చిత్రంలో మంచి మెసేజ్ ఉంది అంది. ఇళయరాజా సంగీత సారథ్యంలో రూపొందిన పాటలు చిత్రానికి ప్లస్ అయ్యే విధంగా వుంటాయి.

తమిళంలో మాదిరిగానే తెలుగులో కూడా ఈ చిత్రం ఘనవిజయాన్ని సాధిస్తుందనే నమ్మకం వుంది అని నిర్మాతలు తెలిపారు. అలాగే సంగీత పాత్ర హైలైట్‌గా రూపొందిన ఈ చిత్రంలో ఆమె పాత్ర మాస్‌ను ఉర్రూతలూగిస్తుంది. ఆమె నట విశ్వరూపాన్ని ప్రేక్షకులు ఈ చిత్రంలో చూడబోతున్నారు అన్నారు. కోట శ్రీనివాసరావు, ఆశిష్‌విద్యార్థి, మాధవ్, గిరీష్ కర్నాడ్, రాజ్యలక్ష్మి తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మాటలు: శశాంక్ వెన్నెలకంటి.