హాజరేకు జై కొట్టిన టాలీవుడ్-సర్కార్ తీరుపై నిరసన :సినీ జ్వాల తెలుగు:

Posted on

దేశంలో అవినీతి నిర్మూలించడాని బలమైన ‘జన్ లోక్ పాల్ బిల్లు’ రావాలనే డిమాండ్ తో పోరాటం చేస్తున్న గాంధేయవాది అన్నా హజారేకు తెలుగు సినిపరిశ్రమ జై కొట్టింది. తమ మద్దతు తెలుపుతూ సంఘీభావం ప్రకటించింది. అదే సమయంలో అన్నా ఉద్యమాన్ని అణచి వేసేందుకు ప్రయత్నిస్తున్న కేంద్ర ప్రభుత్వ తీరును తప్పు బట్టింది. ఈ మేరకు అన్నా పోరాటానికి మద్దతు పలుకుతూ శుక్రవారం హైదరాబాద్ లోని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎదుట ర్యాలీ నిర్వహించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ నోటికి నల్ల గుడ్డలు కట్టుకుని నిరశన తెలిపారు.

ఈ కార్య్రకమంలో దర్శక రత్న దాసరి నారాయణరావుతో పాటు పలువురు దర్శకులు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మురళీ మోహన్, పరుచూరి బదర్స్, హాస్య నటుడు బాబుమోహన్, నటి జీవిత, సంజన తదితరులు పాల్గాన్నారు. ఈ కార్య్రకమానికి అగ్రహీరోలు, మరికొందరు ప్రముఖులు దూరంగా ఉండటం విమర్శలకు తావిస్తోంది.