‘రాచరికం’ కారణంగా ఒకే గూటికి చెందిన రవితేజ, సునీల్ ఇద్దరూ ఇప్పుడు ఒకే ఒరలో ఇమిడిన కత్తుల మాదిరి తయారయ్యారు. రవితేజతో తీద్దామనుకునే కథలకి చిన్న చిన్న మార్పులు చేసి సునీల్ తో చేసేయడానికి దర్శకలు సిద్దపడిపోతున్నారు. రవితేజ అయిదు కోట్ల వరకు వసూలు చేస్తూ ఉండడంతో అందులో సగానికంటే తక్కువకే పని చేస్తున్న సునీల్ తో అయితే అదనపు హంగులూ, ఆర్బాటాలు కూడా అక్కర్లేదు కనుక అతనితో తీయడానికి నిర్మాతలు కూడా ఆసక్తి చూపిస్తున్నాడు.
దాంతో సహజంగానే రవితేజకి డిమాండ్ తగ్గుతోంది. టైటిల్ దగ్గర్నుంచి పోస్టర్ డిజైన్స్ వరకు అన్నీ రవితేజని అనుకరిస్తూ సునీల్ తన కెరీర్ కి సేఫ్ రూటు ఎంచుకున్నాడు. ఫలితంగా రవితేజకి ఎర్త్ పెట్టేటట్టు కనిపిస్తున్నాడని సునీల్ గురించి చెప్పుకుంటున్నారు...