హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం రాష్ట్ర స్థాయి కళాకారుల సదస్సు పార్టీ కార్యాలయంలో ప్రారంభమైంది. ఈ సదస్సుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత, ప్రముఖ సినీ నటి రోజా, ప్రజా గాయకుడు వంగపండు ప్రసాద రావు తనయ వంగపండు ఉష, ప్రముఖ సినీ నటుడు విజయ్ చందర్ తదితరులు హాజరయ్యారు. ఈ సదస్సులో 23 జిల్లాల కళాకారులు పాల్గొన్నారు.జానపద కళారూపాలైన ఒగ్గు కథలు, బుర్ర కథలు, వీధి నాటకాలు తదితర ప్రజాకళల ద్వారా పార్టీ ప్రచారాన్ని చేపట్టనున్నట్లు వంగపండు ఉష ఈ సందర్భంగా తెలిపారు. ఈ సదస్సులో ఆయా జిల్లాలకు సాంస్కృతిక విభాగ కన్వీనర్లను నియమించనున్నారు.