తెరాస ఎమ్మెల్యే ల దీక్షకు మద్దతు ప్రకటించిన లోక్‌సత్తా :సినీ జ్వాల తెలుగు:

Posted on

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా నవంబరు ఒకటో తేదీ నుంచి తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన ఎమ్మెల్యేలు దీక్ష చేపట్టనున్నారు. ఈ దీక్షకు లోక్‌సత్తా పార్టీ మద్దతు ప్రకటించింది. హైదారబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద జరిగే ఈ దీక్షకు తమ పార్టీ మద్దతు ఇస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కంచర్ల ధర్మారెడ్డి తెలిపారు.దీనిపై ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాధన కోసం ఉద్యోగస్తులు చేసిన సమ్మెను స్ఫూర్తిగా తీసుకుని రాజకీయ పార్టీలన్ని ఉద్యమించాలని కోరారు. వందలాది తెలంగాణవాదులు ఆత్మహత్యలు చేసుకున్నా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కలిసి రావడంలేదని విమర్శించారు. ఈ రెండు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు మాని తెలంగాణ రాష్ట్రం కోసం పాటుపడాలని విజ్ఞప్తి చేశారు.