నేటి నుంచి హజారే దీక్ష ప్రారంభం :సినీ జ్వాల తెలుగు:

Posted on

ఇటు కేంద్ర సర్కారు, అటు అన్నా హజారే ఇద్దరూ పట్టువిడుపులు ప్రదర్శించడంతో సామాజిక కార్యకర్త అన్నా దీక్షపై ప్రతిష్టంభన తొలగింది. నెలరోజులపాటు దీక్ష చేస్తానని, అందుకు ఎలాంటి షరతులు విధించరాదని భీష్మించిన అన్నా మెత్తబడ్డారు. దీక్షను 15 రోజులకు కుదించుకున్నారు. శుక్రవారం నుంచి రామ్‌లీలా మైదానంలో దీక్ష కొనసాగించనున్నారు. అయితే ఇక్కడ దీక్షా వేదిక సిద్ధం కాకపోవడంతో గురువారం రాత్రి కూడా అన్నా తీహార్ జైల్లోనే గడిపారు.