సినిమా ఆద్యంతం హీరో పక్కనో...లేక విలన్ పక్కనో ఉంటూ కామెడీ పండించే పాత్రలకు మన తెలుగు సినిమాల్లో భలే డిమాండ్ ఉంది. ఇలాంటి పాత్రలతోనే బ్రహ్మానందం, బాబుమోహన్ లాంటి వారు అప్పట్లో టాప్ కమెడియన్లుగా ఎదిగారు. తర్వాత వీరి స్థానాన్ని వేణు మాధవ్, సునీల్ లాంటి కెమడియన్లు ఆక్రమించారు.
తాజాగా...సునీల్ కామెడీ వేషాలు వదిలేసి హీరో పాత్రలు మాత్రమే చేస్తుండటంతో సునీల్ లేని లోటు బాగా కనిపిస్తోంది. వేణు మాధవ్, మరికొందరు ఉన్నప్పటికీ కొన్ని పాత్రలకు సునీల్ అయినే సెట్ అవుతాడు. ఈ నేపథ్యంలో సునీల్ లాంటి వారి కోసం వేట సాగిస్తున్న దర్శక నిర్మాల దృష్టిని ఆకర్షిస్తున్నాడు వెన్నెల కిషోర్. సునీల్ తరహాలోనే హైటు, వెయిటు, కలరు ఉండటంతో అతన్ని సునీల్ తరహా పాత్రల్లో ఉపయోగించుకోవాలని చూస్తున్నారు.
ఆ మధ్య వచ్చిన ‘వెన్నెల’ సినిమా ద్వారా తెరకు పరిచయమైన కిషోర్...తెలంగాణ యాసతో డైలాగులు విసురుతూ ఆకట్టుకుంటున్నాడు. అతను నటించిన ఇంకోసారి, బిందాస్, అహనా పెళ్లంట, ఏమైంది ఈ వేళ తదితర చిత్రాల్లో కిషోర్ పండించిన కామెడీకి మంచి మార్కులు పడ్డాయి. ఈ నేపథ్యంలో సునీల్ స్థానాన్ని వెన్నెల కిషోర్ పూర్తిగా ఆక్రమించే అవకాశం ఉందంటున్నారు సినీ విశ్లేషకులు.