సీనియర్ నటుడు సుమన్‌ హీరోగా చిత్రం :సినీ జ్వాల తెలుగు:

Posted on

సీనియర్ హీరో సుమన్ హీరోగా ఓ సినిమా ఓ ప్రేమకా చిత్రం రూపొందుతోంది. ఈ వయసులో ఇతగాడు హీరోగా సీనిమా..అందులనూ ప్రేమకథతో..అంటే ఆశ్చర్యంగా ఉంది కదూ. కానీ ఆయన వయసుకు తగిన విధంగానే ఈ సినిమా ఉండబోతోంది. 40 వయసు స్టిల్‌ బ్యాచిలర్‌ ప్రేమలో పడితే ఎలా ఉంటుందో చూపిస్తూ ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. సుమన్‌ హీరో. తమిళ నటి నదియ కథానాయిక. డాడి.హేమారెడ్డి దర్శకురాలు. శ్రీ వెంకట నరసింహా క్రియేషన్స్‌ పతాకంపై మణిమహేష్‌ నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌ రామానాయుడు స్టూడియోలో సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్య్రకమంలో నిర్మాతలు డి. రామానాయుడు, బెల్లంకొండ సురేష్, పెనుపాక ఎమ్మెల్యే కాంతారావుతదితరులు పాల్గొన్నారు.

దర్శకురాలు మాట్లాడుతూ ‘నవంబర్‌లో సెట్స్‌కెళుతున్నాం. వైజాగ్‌ రామానాయుడు స్టూడియోలో సినిమా చిత్రీకరిస్తాం’ అన్నారు. సినిమా లాభంలో 20శాతం వృద్ధుల సంక్షేమానికి ఉపయోగిస్తామని నిర్మాత తెలిపారు. హీరో సుమన్ మాట్లాడుతూ ‘సాంకేతిక నిపుణులంతా మహిళలే పనిచేస్తున్న చిత్రమిది. మంచి సందేశం ఉన్న కమర్షియల్‌ చిత్రమిది. చాలా గ్యాప్‌ తర్వాత హీరోగా వస్తున్నా’ అన్నారు. ఈ సినిమాలో ఇంకా రమాప్రభ, సురేష్‌, అక్షయ, హేమ, మణిమహేష్‌, భరణి తదితరులు నటిస్తున్నారు. కెమెరా: విజయశ్రీ, సంగీతం: కౌసల్య, కళ: లీలాచంద్ర, పాటలు: కౌసల్య, శ్రేష్ట, ఎడిటింగ్‌: ముత్తులక్ష్మి, కాస్ట్యూమ్స్‌: జయంతి, ఆడియోగ్రఫి: ఎమ్‌.గీతా గురుప్ప, డాన్స్‌: పూజా జోషి, మోరిచ ఫెర్నాండెజ్‌, మేకప్‌: శోభ.