‘‘అమ్మ చాటు పెరిగిన ఆడపిల్ల ఒక్కసారిగా అత్తింట్లోకి అడుగుపెట్టినప్పుడు ఎంత కంగారు పడతారో… కథానాయికగా తొలిసారి మేకప్ వేసుకున్నప్పుడు నేనూ అంతే కంగారు పడ్డాను’’ అన్నారు దీక్షాసేథ్. అంతగా కంగారుపడిన ఈ బ్యూటీ చేతిలో ఇప్పుడు ఐదు సినిమాలు ఉన్నాయి. తన ఆరోగ్యం, అందం గురించి ఆలోచించుకోవడానికి కూడా తీరిక లేనంత బిజీ బిజీగా షూటింగ్స్ చేస్తున్నారు దీక్షా.
ఇప్పుడు కంగారు స్థానంలో ఉత్సాహం చేరిందని దీక్షా సేథ్ చెబుతూ -‘‘సినిమాల్లోకొచ్చిన కొత్తలో ‘ఎవరూ పుట్టుకతో ఆర్టిస్టులు అవ్వరు. అనుభవమే పాఠాలు నేర్పుతుంది. మనం కంగారుపడితే ఏమీ చేయలేం’ అని సీనియర్లు నాలుగు మంచి మాటలు చెప్పారు. అవి నాలో ఆత్మస్థయిర్యాన్ని నింపాయి. కష్టమో, సుఖమో… ఉండాల్సింది ఇక్కడే కాబట్టి మానసికంగా నన్ను నేను ప్రిపేర్ చేసుకున్నాను. ఒక పాత్ర ఒప్పుకున్న తర్వాత దానికి నూరు శాతం న్యాయం చేయడానికి ఎంత కష్టపడాలో అంత కష్టపడుతున్నాను’’ అన్నారు. ప్రస్తుతం ప్రభాస్ సరసన ‘రెబల్’, రవితేజతో ‘నిప్పు’, మనోజ్‌తో ‘ఊ కొడతారా ఉలిక్కి పడతారా’ చిత్రాలతో పాటు తమిళంలో విక్రమ్ సరసన ‘రాజబాట్టయ్’, శింబుతో ‘వేట్టయ్ మన్నన్’లో నటిస్తున్నారామె.
వీటిలో ఒక సినిమా ఈ ఏడాది విడుదలవుతుందట. మిగతా నాలుగు సినిమాలు వచ్చే ఏడాది విడుదలవుతాయట. ఈ విషయం గురించి దీక్షా సేథ్ చెబుతూ – ‘‘వచ్చే ఏడాది నాలుగు నెలల సమయంలో నావి నాలుగు సినిమాలు విడుదలవుతాయి. అంటే.. నెలకోసారి తెర మీద కనిపిస్తానన్న మాట. అది తల్చుకుంటేనే చాలా థ్రిల్‌గా ఉంది. ఇంకో విషయం ఏంటంటే.. ఈ ఐదు చిత్రాల్లోనూ నేను చేస్తున్నవి మంచి పాత్రలే. భవిష్యత్తులో వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు.. ఫర్వాలేదు. నటిగా సాధించాం అనే ఫీలింగ్ నాకు కలగాలి. అందుకే మంచి సినిమాలు, పాత్రలు ఎన్నుకుంటున్నాను’’ అన్నారు.