సౌత్ సినిమాపై తనకు పెద్దగా ఆసక్తి లేదని ‘రాణా’ సినిమా ఆలస్యం కావడంపై గతంలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే పెదవి విరిచింది. రజనీకాంత్ హీరోగా తెరకెక్కనున్న ‘రాణా’ సినిమాలో హీరోయిన్‌గా దీపిక నటించాల్సి వున్న సంగతి తెలిసిందే. అయితే రజనీ అనారోగ్యం కారణంగా ‘రాణా’ సినిమా అటకెక్కిందన్న వార్తలతో సౌత్ సినిమాపై చిన్నచూపు ప్రదర్శించింది. అయితే గతంలో అన్న ఈమాటల్ని ఏదో నిరుత్సాహంలో అన్నానేగానీ, ఇంకోటి కాదని, పైగా తన కాల్షీట్లు ఖాళీగా లేవని, అంతే తప్ప ఇంకోటి కాదని దీపిక వివరణ ఇచ్చుకుంది.
దీపిక ఇలా మనసు మార్చుకోవడం వెనుక చాలా కారణాలే ఉన్నాయి. పలువురు బాలీవుడ్ ప్రముఖులు సౌత్ సినిమాపై ఆసక్తి పెంచుకోవటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. బాలీవుడ్ సినిమాలు దక్షిణాదిన విడుదలవుతాయి. అలాగే సౌత్ సినిమా బాలీవుడ్‌లో హల్‌చల్ చేస్తోంది. కాబట్టి వీలైనంత మేరకు ప్రేక్షక లోకానికి పరిచయం కావటం సినిమా కెరీర్‌కు విజయాన్ని చేకూర్చుతుందని దీపిక అర్థం చేసుకుంది.ఎలాగైతేనేం…దీపిక సౌత్ సినిమాపై సాఫ్ట్‌కార్నర్‌తో వుండటం, రెమ్యునరేషన్ విషయంలోనూ తనకు పెద్దగా పట్టింపుల్లేవని దీపిక ప్రకటించడం…వెరసి సౌత్ సినిమా నుంచి దీపికా పదుకొనే గురించి వాకబు చేసే దర్శకనిర్మాతల సంఖ్యను పెంచింది.దీపిక ప్రస్తుతం మూడు నుంచి ఐదు కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నప్పటికీ, కోటిన్నర నుంచి రెండు కోట్ల వరకు రెమ్యునరేషన్ చెల్లించేందుకు సౌత్‌లో భారీ సినిమాల నిర్మాతలు సిద్ధంగా వున్నారట !