వివాదస్సద వ్యాఖ్యలు చేస్తూ ఎప్పడూ వార్తల్లో ఉండే నటి, డిఎంకె నేత ఖుష్భూ....మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. దేశ వ్యాప్తంగా అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమిస్తూ అన్నా హజారే పోరాటానికి మద్దతు పలుకుతుంటే, కుష్భూ మాత్రం అన్నా ఉద్యమాన్ని వ్యతిరేకిస్తోంది. హజారే సొంత ఎజెండాతో ఉద్యమం చేస్తున్నాడని, హజారే చేస్తున్న పోరాటంతో తాను ఏకీభవించబోనని ప్రకటన చేసింది.యూపీఏ ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లు సక్రమంగానే ఉందని, అసహజ అధికారాలు కోరుతూ హజారే చేస్తున్న ‘జన్ లోక్ పాల్’ బిల్లు డిమాండ్ సరైంది కాదని అభిప్రపాయ పడ్డారు.
కుఃష్బూ వ్యాఖ్యలపై హజారేకు మద్దతుగా నిలుస్తున్న ఉద్యమ కారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలు దేశ ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయని ఆరోపిస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించుకోవాలని యోచిస్తున్నారు. అదే జరిగితే ఖుష్భూ మరోసారి కోర్టుల చుట్టూ తిరగటం ఖాయంగా కనిపిస్తోంది.
పెళ్లికి ముందు శృంగారం తప్పుకాదంటూ గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఖుష్బూ....కోర్టు చిక్కులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.