బ్రిటిసర్లకు కప్పం కట్టకుండా ఉండటం కోసం తనకు ఏమీ తెలీకపోయినా వారితో క్రికెట్ ఆడి గెలుస్తానని పందెం కాసి గెలిచే భువన్ పాత్రలో లగాన్ అంటూ అమీర్ ఖాన్ నటించిన చిత్రం స్పూర్తిగా ఆర్య హీరోగా ఓ చిత్రం వస్తోందిప్పుడు. మల్టీ డైమన్షన్ ఎంటర్ టైన్ మెంట్స్ (ప్రై) లిమిటెడ్ అందిస్తున్న ఈ చిత్రం పేరు ‘1947 ఎ లవ్ స్టోరీ’. ఎఎల్ విజయ్ దర్శకత్వం వహించగా తమిళంలో ఘనవిజం సాధించిన ‘మదరాసు పట్టణం’ కు ఇది అనువాద రూపం.
ఈ చిత్ర విశేషాలను మల్టీ డైమన్షన్ అధినేత రజత్ పార్థసారధి చెబుతూ బ్రిటీష్ బారు భారతదేశాన్ని పాలిస్తున్న రోజుల్లో మదరాసు పట్టణం ఎలా ఉండేది? ఇప్పుడెలా మారిపోయింది? అనే అంశంతో ఈ సినిమా రూపొందింది. ఇది ఓ మదరాసు యువకునికీ ఓ ఆంగ్లేయ యువతికీ మధ్య నటిచే ప్రేమకథ. కథ ప్రకారం స్వరాజ్య పోరాటం ఊపందుకున్న కాలంలో మదరాసులోని ఓ దోభీఘాట్ ని తొలగించాలనే బ్రిటీష్ వాళ్ల ప్రయత్నాన్ని పార్తి అనే యువకుడు అడ్డుకుంటాడు. తనతో మల్లయుద్దంచేసి గెలిస్తే మదరాసు ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోతామని ఓ బ్రిటిష్ సైనికుడు చేసిన సవాల్ ని పార్తి స్వీకరిస్తాడు. అతని ధైర్య సాహసాలు చూసి మదరాసు గవర్నర్ జనరల్ కూతురు అమి ప్రేమిస్తుంది. మల్ల యుద్దంలో పార్తి గెలిచాడా, పార్తి అమి జాక్సన్ ప్రేమ ప్రయాణం చివరికి ఏమయ్యింది అనే అంశాలు ఆసక్తికరం. 20కోట్ల రూపాయల భారీ వ్యయంతో రూపొందిన ఈ సినిమా పాటల్ని ఈ నెల్లో, సినిమాని సెప్టెంబర్ లో విడుదల చేస్తాం’ అని చెప్పారు.