అక్కినేని యువహీరో నాగచైతన్య తర్వాతి సినిమా టైటిల్ ఖరారైనట్లు తెలుస్తోంది. రాధామోహన్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందబోతోందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు ‘గౌరవం’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు సినీవర్గాల నుంచి అందిన విశ్వసనీయ సమాచారం. ఈ సినిమా గురించి వినిపిస్తున్న మరో గాసిప్ ఏమిటంటే ఇందులో నాగచైతన్యతో ఆయన తండ్రి నాగార్జున స్క్రీన్ పంచుకోనున్నారట.నాగచైతన్య పవర్ ఫుల్ క్యారెక్టర్ లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇంకా హీరోయిన్ ఎంపిక జరుగలేదు. 2012లో ఈ సినిమా సెట్స్ మీదనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన విషయాలపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.