దడ ను డామినేట్ చేస్తూ కలెక్షన్స్ కురిపిస్తున్న కందిరీగ... :సినీ జ్వాల తెలుగు:

Posted on

గత వారం నాగ చైతన్య దడ, రామ్ కందిరీగ రిలీజ్ తో ధియేటర్లు సందడిగానే ఉన్నాయి. దడ గత గురువారం విడుదల కాగ, కందిరీగ శుక్రవారం రిలీజ్ అయ్యింది. వరుసగా 4 రోజులు సెలవలు ఉండటంతో రెండు సినిమాలకి ఓపెనింగ్ కలెక్షన్స్ బాగానే వచ్చాయి. రెండిటిలోనూ కథ రొటీనే. అయితే దడ నెగిటివ్ టాక్ తో సాగుతుండటంతో కందిరీగ వీకెండ్ అయిపోయిన తరువాత కూడా మంచి కలెక్షన్స్ సంపాదిస్తుంది.

అయితే ఈ రెండు సినిమాలలో కామన్ ఫ్యాక్టర్ ఒకటుంది. రెండు సినిమాలలోనూ హీరోయిన్లుకు బ్యాడ్ టాక్ ఉంది. దడ లో కాజల్, కందిరీగలో హన్సిక అంత అందంగా కనిపించలేదు. ఓవరాల్ గా కొన్ని వారాలుగా నిస్తేజంగా ఉనా తెలుగు ప్రేక్షకులకు ఈ రెండు సినిమాలు కాస్త ఊపు తెచ్చాయి. వీటి హవా మొదలవడంతో కాంచన, రంగం, నాన్న డబ్బింగ్ సినిమాల జోరు తగ్గింది. ఇక ఈ శుక్రవారం సంతోష్ సివన్ దర్శకత్వం వహించిన “ఉరిమి”, మిస్టర్ రాస్కెల్, ముగ్గురు అనే సినిమాలు విడుదల అవుతున్నాయి.