జగన్ ను జైలులో పెడతారా?జగన్ పై కేసులు పెడతారా? జగన్ అవినీతిపరుడా ? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఎలా ఉన్నప్పటికీ తాజాగా వచ్చిన ఒక సర్వేలో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రలోను, తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణలోను ప్రభంజనం సృష్టిస్తాయని వెల్లడవుతోంది.సీమాంధ్ర ప్రాంతంలో జగన్ పార్టీకి 36శాతం ఓట్లు వస్తాయని సిఎన్ ఎన్ సర్వే చెబుతోంది.అదేవిధంగా తెలంగాణలో టిఆర్ఎస్ కు ముప్పైఆరుశాతం ఓట్లు వస్తాయని తేలింది.విచిత్రంగా ఈ రెండు ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీ రెండో స్థానంలో ఉండడం. సీమాంధ్రలో తెలుగుదేశం రెండో స్థానంలో ఉంటుందని భావిస్తే, ఆశ్చర్యకరంగా కాంగ్రెస్ పార్టీ ముప్పై రెండు శాతం ఓట్లతో రెండో స్థానంలో ఉంది. తెలుగుదేశం పారట్ఈ ఇరవై శాతం ఓట్లతో మూడో స్థానానికి పరిమితం అవుతోంది. కాగా తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీకి ఇరవై శాతం ఓట్లు వస్తున్నాయి. తెలంగాణలో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీకి ఏడు శాతం మాత్రమే దక్కే అవకాశం ఉంది.తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో మెరుగుపడిన సూచనలు కనిపించడం లేదు.తెలుగుదేశం పార్టీకి ఇది ఒకరకంగా తీవ్ర నిరాశ కలిగించే పరిణామమే. కాగా జగన్ ను జైలువరకు తీసుకు వెళితే ఇంకా సానుభూతి పెరిగి మరింత ప్రమాదంలో పడుతామని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. అవినీతి కేసులతో సతమతమవుతున్న జగన్ కు ఇది ఉపశమనం కలిగించే అంశమే.