అల్లు అర్జున్ కి తీరని అన్యాయం...! :CineJwala Telugu:

Posted on

మరోసారి నంది అవార్డుల వ్యవహారంలో మెగా ఫ్యామిలీ హీరోకి అన్యాయం జరిగింది గత నంది అవార్డుల్లో ఉత్తమ నటుడి అవార్డు చరణ్ ని వరించాల్సిందే కానీ దాసరి అడ్డుపడి తనకి ఆ అవార్డు దక్కేలా చేసుకున్నాడు. దాంతో దాసరి విపరీతంగా విమర్శలకి గురయ్యాడు. ఈసారి కూడా నంది అవార్డులు అసలు మెగా హీరోలకి రాకుండా చూసుకోవడంలో ఓ వర్గం విజయవంతమైంది.

నిజానికి వేదం సినిమాకి అల్లు అర్జున్ కి ఏదో ఒక అవార్డు ఖాయమనుకున్నారు. ఏదీ కాకపోతే కనీసం జ్యూరీ ప్రశంస అయినా దక్కుతుందని అనుకున్నారు. కానీ అది కూడా రాకుండా చేశారు. వేదంలో కెరీర్ బెస్ట్ ఫెర్ ఫార్మెన్స్ ప్రదర్శించిన అల్లు అర్జున్ కి ఫిలింఫేర్ తో సహా పలు అవార్డులొచ్చాయి.కానీ నంది అవార్డుల్లో మాత్రం అతనికి స్థానం దక్కకపోవడం విమర్శలకి తావిస్తోంది.