షారూఖ్ కాపురంలో చిచ్చు పెట్టిన ప్రియాంక :CineJwala Telugu:

Posted on

ఫ్యాషన్ డిజైనర్ అయిన గౌరీని ప్రేమించి...మతాలకు అతీతంగా పెద్దలను ఎదురించి మరీ పెళ్లి చేసుకున్నాడు బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్. గత 20 ఏళ్లుగా సాఫీగా సాగుతున్న వీళ్ల కాపురంలో ప్రస్తుతం కలతలు రేగాయి. భార్య గౌరీ.. షారూఖ్ కు వార్నింగ్ ఇచ్చే వరకు వెళ్లిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంతకాలం మంచి ఫ్యామిలీ ఇమేజ్ ఉన్న షారూఖ్ కాపురంలో చిచ్చు రేగడానికి ఫ్యాషన్ గర్ల్ ప్రియాంక చోప్రానే కారణమట.

షారూఖ్ కు బాలీవుడ్ హీరోయిన్లందరితో మంచి సంబంధాలు ఉన్నాయి. కాజోల్ దగ్గర నుంచి కరీనా దాకా ఆయనతో చాలా సన్నిహితంగా ఉంటారు. అయితే వీళ్లందరితో ఉన్న సంబంధానికి, ప్రియాంకతో ఉన్న బంధానికి చాలా తేడా ఉందని బాలీవుడ్ జనాలు గుసగుసలాడుకుంటున్నారు. డాన్ సినిమాలో తనతో పాటు నటించినప్పటి నుంచే షారూఖ్, ప్రియాంకల మధ్య ఎఫైర్ కొనసాగుతోందట. ఈ మధ్య ఇద్దరి మధ్య చనువు బాగా పెరగడంతో అనుమానం వచ్చిన గౌరీ విషయం అరా తీయగా ఇద్దరూ హద్దులు దాటుతున్నారని ఆమె దృష్టికి వచ్చినట్లు తెలిసింది. దీంతో షారూఖ్ నేనో...తనో తేల్చు కోవాలని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిందట.