యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ బిజీ షెడ్యూల్..! :CineJwala Telugu:

Posted on

యంగ్‌టైగర్‌ జూ ఎన్టీఆర్‌కు చేతినిండా సినిమాలతో దాదాపు రెండేళ్లదాకా బిజీ షెడ్యూల్స్ తో ఉండేలా కనిపిస్తోంది. ప్రస్తుతం ‘ఊసరవెల్లి’ బ్యాంకాక్‌, స్విడ్జర్లాండ్‌ లలో చిత్రీకరణ జరుపుకుంటోంది. త్వరలోనే షూటింగ్‌ పనులను పూర్తిచేసుకుని దసరాకు విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్‌ చేస్తున్నారు. ఇవిగాక పూరీజగన్నాధ్‌, శ్రీనువైట్ల చిత్రాలలో జూనియర్‌ ఎన్టీఆర్‌ నటించనున్నట్లు సమాచారం.

ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ‘గుండమ్మ కథ’ను రీమేక్‌ చేసే యోచనలో ఉంది. ఇప్పటికే ఎన్టీఆర్‌, నాగచైతన్యలను హీరోలుగా అనుకుంటున్నారంతా. గుండమ్మగా అలనాటి అందాల తార రాధను నటింపజేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ ప్రాజెక్టులు పూర్తిచేయడానికి రెండేళ్లు పట్టవచ్చు. ఇప్పుడు ఎన్టీఆర్‌ తో చిత్రాన్ని నిర్మించాలంటే కచ్చితంగా మరో రెండేళ్లు ఆగాల్సిందేనంటున్నారు. అప్పటిదాకా ఎన్టీఆర్‌ డైరీ ఫుల్‌.