నయనతారకు సంప్రదాయవాదుల నుంచి చీదరింపులు! :CineJwala Telugu:

Posted on

దక్షిణాది సినిమా పరిశ్రమలో సక్సెస్ ఫుల్ గా టాప్ స్టార్ రేంజ్ కు ఎదిగిన తార నయనతార. ఇది నాణేనికి ఒక వైపు మాత్రమే. మరో వైపు ఆమె జీవితంలో అనేక వివాదాలు, ‘సం’బంధాలు. నయన తార జీవితంలో ఉన్నన్ని వివాదాలు... బహుషా గతంలో ఏ దిక్షిణాది హీరోయిన్ జీవితంలోనూ ఉండవు కాబోలు.

హీరోయిన్ గా ఎదుగుతున్న సమయంలో తమిళ నటుడు శింబుతో ఘాటు ప్రేమాయణం సాగించి... ఇంటర్నెట్ సాక్షిగా ముద్దులతో మునిగి తేలింన ఈ తార అతనితో సీక్రెట్ గా ఎలాంటి సంబంధం నడిపిందో ఊహించడం పెద్ద కస్టమేమీ కాదు. తర్వాత అతనితో తెగదెంపులు, వివాహితుడైన ప్రభుదేవాతో లవ్వాయనం. ప్రభుదేవా తన భార్య పిల్లలను విడి పెట్టి తన వెంట వచ్చేలా చేయడమే కాదు, అతని మొదటి భార్య రమలత్ కు విడాకులు ఇప్పించి ఇప్పడు తనతో రెండో పెళ్లి సిద్దం అయ్యే వరకు తెచ్చుకుంది. ఇదంతా ఒక ఎత్తయితే నయన తార క్రిష్టియన్ మతం నుంచి హిందూ మతంలోకి మారడం సంచలనం సృష్టించింది.

అయితే నయన ప్రవర్తనపై కొందరు సాంప్రదాయ వాదులు మండి పడుతున్నారు. భారత స్త్రీ జాతికే కలంకం తెచ్చేలా ఆమె ఆమె జీవితం ఉందని. ఆమె చేసే పనులు చట్ట పరంగా తప్పుగా కనిపించక పోయినా.....సనాతన భారత సాంప్రదాయానికి మచ్చ తెస్తున్నాయని అంటున్నారు. కర్చిప్ లను మార్చినట్లుగా మగాళ్లను మార్చి, ఓ స్త్రీ సంతోషాన్ని పోగొట్టి, ఇద్దరు పిల్లలకు తండ్రిని లేకుండా చేసిన ఆమె మతం మార్చినంత మాత్రాన పవిత్రురాలు అయిపోదని మరికొందరు విమర్శిస్తున్నాయి. మరి నయన జీవితంలో ఇలాంటి వివాదాలు ఇంకా ఎన్ని చూడాలి్స వస్తుందో..?