చైతూ అనే ముద్దు పేరుతో పిలువబడే నాగచైతన్యకు స్టార్ డమ్ వచ్చినట్లేనని చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు భావిస్తున్నారు. సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చినా..రెండో రోజు కూడా ‘దడ’ సినిమాకు మంచి కలెక్షన్లు రావడం అందుకు నిదర్శనంగా పేర్కొంటున్నారు. ‘దడ’ సినిమాను అందరూ ‘కెడి-2’ అంటుండడం తెలిసిందే. నాగచైతన్య మొదటి సినిమా ‘జోష్’ కంటే ఘోరంగా ఉందని కూడా అంటున్నారు. అయినప్పటికీ ..రెండో రోజు కూడా విడుదలైన అన్ని థియేటర్లలో ‘దడ’ సినిమా హౌస్ ఫుల్ అయ్యిందనే వార్తలు వస్తున్నాయి.
రేపెలాగూ ఆదివారం కాబట్టి..రేపు కూడా హౌస్ ఫుల్ అయితే..దాదాపుగా ఈ సినిమా సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయినట్లే అవుతుంది. 12-13 కోట్ల బడ్జట్ తో రూపొందిన ఈ చిత్రాన్ని 11కోట్లకు అవుట్ రైట్ గా ఆర్ ఆర్ మూవీమేకర్స్ కు అమ్మేసారు. శాటిలైట్ రైట్స్ రూపంలో వచ్చే రెండు రెండున్నర కోట్లను కలుపుకుంటే..నిర్మాతకు నష్టమేమీ ఉండదు. ఇక ఆర్ ఆర్ మూవీమేకర్స్ కూడా ఈ సినిమాను చాలా ఏరియాల్లో అమ్మేసిందని తెలుస్తోంది. ఆర్ ఆర్ మూవీమేకర్స్ నుంచి కొనుక్కున్నవాళ్లు కూడా పెద్దగా నష్టపోయే పరిస్థి లేదని, ఒకవేళ ఎవరైనా ఉంటే..వాళ్లకు తమ తదుపరి చిత్రాలతో కాంపన్సేట్ చేసేందుకు ఆర్ ఆర్ వెంకట్ సుముఖంగా ఉన్నారని తెలుస్తోంది.