వైఎస్ కుటుంబం ఎటువంటి అక్రమ సంపాదనలకు పాల్పడలేదని అక్రమాలు తమ ఇంటా...వంటా లేవని మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి పేర్కొన్నారు. గురువారం ఉదయం మీడియా సమావేశంలో మాట్లాడుతు రాష్ట్ర అభివృద్ధి కోసమే వైఎస్ హయాంలో భూకేటాయింపులు జరిగాయని ఈ విషయంలో మంత్రులందరూ భాగస్థులే అని ఆయన అన్నారు. రాజకీయ నాయకులు కొందరు పనికట్టుకుని జగన్‌పై నిందలు వేయడం సరికాదని వివేకా పేర్కొన్నారు.