మణిరత్నం చిత్రంలో రానా :CineJwala Telugu:

Posted on

రానా త్వరలో మణిరత్నం దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నాడు. తెలుగు తమిళ భాషల్లో రూపొందించిన రావణ్ చిత్రం తర్వాత మహేష్‌బాబుతో పొన్నియన్ సెల్వన్ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా రూపొందించాలని ప్లాన్ చేశారు మణిరత్నం. కానీ ఫైనాన్షియర్స్ ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆ చిత్రాన్ని పక్కన పెట్టిన ఆయన త్వరలో ఓ యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ని రూపొందించబోతున్నాడు. ఈచిత్రం కోసం ఇటీవల రానాని ఆయన సంప్రదించాడని ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు కొద్ది రోజుల్లో అధికారికంగా ప్రకటించనున్నారని తెలుస్తోంది. లీడర్ చిత్రం విడుదలకు ముందే రోహన్ సిప్పి రూపొందించిన దమ్ మారో దమ్ చిత్రంతో బాలీవుడ్‌కు పరిచయమయ్యే అవకాశం దక్కించుకున్న రానా ప్రస్తుతం బాలీవుడ్‌లో రామ్‌గోపాల్‌వర్మ రూపొందిస్తున్న డిపార్ట్‌మెంట్ అలాగే తెలుగులో జెనీలియా కథానాయికగా నటిస్తున్న నా ఇష్టం చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ టైమ్‌లోనే రానాకు ప్రముఖదర్శకుడు మణిరత్నం చిత్రంలో నటించే అవకాశం రావడం విశేషం