రామ్ చరణ్ తేజ్ పెళ్లికి తొందరేమీ లేదని మెగా స్టార్ చిరంజీవి అన్నారు. తిరుమలలో ఆటో రిక్షా డ్రైవర్లు ఆందోళనకు దిగిన నేపథ్యంలో సమస్య పరిష్కారానికి ఆయన గురువారం సాయంత్రం హుటాహుటిన హైదరాబాదు నుంచి బయలుదేరి తిరుపతికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రామ్ చరణ్ తేజ్ పెళ్లి విషయాలు వ్యక్తిగతంగా చెప్తానని ఆయన అన్నారు. తాను ఈ నెల 20వ తేదీన రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెసులో చేరుతున్నట్లు ఆయన తెలిపారు. తమ ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులు ముఖ్యనేతలు 22వ తేదీన హైదరాబాదులో కాంగ్రెసులో చేరుతారని ఆయన చెప్పారు.