యంగ్ హీరో రాం చరణ్ తేజ, ఉపాసన కామినేని ప్రేమించుకుంటున్నట్టూ, త్వరలో వివాహం చేసుకోనున్నట్టు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. వీరి ప్రేమకు ఇరు కుటుంబాల ఆమోదం కూడా లభించింది. తయుడి పెళ్లి వార్తలపై చిరంజీవి ఈరోజు మీడియా ముందు నోరు విప్పారు. మరో వారం రోజుల్లో రాం చరణ్ పెళ్లికి సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేస్తామని ఆయన చెప్పారు. రాం చరణ్, ఉపాసనల పెళ్లి నిశ్చితార్ధం ఈ ఏడాదే ఉంటుందని చిరంజీవి తెలిపారు. వారి వివాహానికి సంబంధించిన వివరాలను ఇరు కుటుంబాలు కలిసి మీడియాకు తెలియజేస్తాయని ఆయన చెప్పారు.