తెలుగు వాడైన తమిళ కథానాయకుడు విశాల్ తాజాగా ప్రేమలో పడ్డాడని కోలీవుడ్ కోడై కూస్తోంది. ప్రస్తుతం తమిళ నాట వర్ధమాన తారగా పేరు తెచ్చుకుంటున్న వరలక్ష్మిని మనవాడు డీప్ గా ప్రేమిస్తున్నాడట. ఇద్దరూ కలిసి పార్టీలకు షికార్లు చేస్తున్నారని కూడా అంటున్నారు. త్వరలో పెళ్లి చేసుకోవాలని కూడా వీరు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. వీరి ప్రేమ పెద్దల వరకూ వెళ్ళిందనీ, వారు కూడా సానుకూలంగా స్పందిస్తున్నారనీ తమిళ మీడియా చెబుతోంది. ఇంతకీ ప్రముఖ నటుడు శరత్ కుమార్ కూతురే ఈ వరలక్ష్మి. త్వరలోనే ఈ జంట ఒకటి కావాలని మనమూ ఆశిద్దాం.