మెగాస్టార్ దౌత్యం :CineJwala Telugu:

Posted on

తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి చేసిన ప్రయత్నాలు ఫలించాయి. చిరంజీవి దౌత్యం నేపథ్యంలో తిరుమల ట్యాక్సీ డ్రైవర్లు చేసిన డిమాండ్‌లకు తిరుమల తిరుపతి దేవస్థానం తలొగ్గింది. టిటిడి విధించిన ట్రాఫిక్ నిబంధనలు సడలించింది. ఓ నెల రోజుల పాటు నిబంధనలు వాయిదా వేస్తున్నట్లు టిటిడి ప్రకటించింది. అంతేకాకుండా కొండ పైకి ట్యాక్సీలను అనుమతించకపోతే భక్తులందరికీ సౌకర్యం కల్పించడం కష్టమని కూడా టిటిడి భావించినట్లుగా తెలుస్తోంది. ట్యాక్సీ డ్రైవర్ల డిమాండ్ మేరకు టిటిడి నిబంధన ఆంక్షలను తొలగించడానికి చిరంజీవి చాలా ప్రయత్నాలు చేశారు. తిరుమల కొండ పైకి ట్యాక్సీ డ్రైవర్లను టిటిడి అనుమతించక పోవడంతో వారు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. . చిరంజీవి మాట ఇచ్చినందు వల్ల ట్యాక్సీ డ్రైవర్లు శుక్రవారం నాటి ఆందోళనను వాయిదా వేసుకున్నారు. ఇంతలో చిరంజీవి సిఎం కిరణ్ కుమార్ రెడ్డి టిటిడి అధికారులతో దౌత్యం నెరపి ప్రస్తుతానికి సమస్యను పరిష్కరించారు