అంతర్జాతీయ దేశీయ పటిష్ట మద్దతుతో భారత్లో బంగారం ధర పరుగు కొనసాగుతోంది. ముంబై బులియన్ మార్కెట్లో 99.9 స్వచ్ఛత 10 గ్రాముల ధర గురువారం రూ.385 పెరిగి రూ.26320కి చేరింది. ఇక 99.5 స్వచ్ఛత ధర రూ.390 ఎగసి రూ.26195కు ఎగసింది. ఇవి ఇక్కడ చరిత్రాత్మక స్థాయులు. ఇక న్యూఢిల్లీలో కూడా ఈ రేట్లు రూ.435 చొప్పున పెరిగి వరుసగా రూ.26490 రూ.26370కి చేరాయి. ఇక ముంబైలో వెండి కేజీ ధర రూ.1250 ఎగసి రూ.60110కి చేరగా ఢిల్లీలో రూ.1100 ఎగసి రూ.59200కు చేరింది. కాగా అంతర్జాతీయంగా నెమైక్స్ కమోడిటీ మార్కెట్లో డిసెంబర్ డెలివరీ ధర ఒక దశలో ఔన్స్ 1817 డాలర్ల చరిత్రాత్మక స్థాయులను తాకినప్పటికీ కడపటి సమాచారం అందేసరికి క్రితం ముగింపు (1784 డాలర్లు) కన్నా నష్టాల్లో 1740 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.