ఇటీవలే హిందూ మతంలోకి మారిన మలయాళ భామ నయనతార తన ప్రియ సఖుడు ప్రభుదేవాని వదిలి వుండలేకపోతోందట. అందుకే, 'రౌడీ రాథోర్' హిందీ సినిమా షూటింగు కోసం ప్రస్తుతం ముంబైలో వున్న ప్రభూని కలవడానికి తాజాగా నయన్ కొచ్చీ నుంచి ముంబై చేరుకుంది. తమ పెళ్లి ఏర్పాట్ల గురించి వీరిద్దరూ చర్చించుకుంటున్నట్టు తెలుస్తోంది. సాధ్యమైనంత వరకు తమ వివాహాన్ని ముంబైలోనే జరుపుకోవాలని వీరు కోరుకుంటున్నారట. చెన్నైలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చేసుకోకూడదని నయన్ భావిస్తోందట. ఏమైనా, ప్రియుని చెంత చేరి రిలాక్స్ అవుతున్న నయనతార కొత్త సినిమాలేవీ ఇంత వరకు ఒప్పుకోలేదు.