నువ్వు..! :CineJwala Telugu:

Posted on

తూరుపులా నేనిక్కడే నిలుచుని
ఎదురుచూస్తున్నా
నువ్వే చందమామ లా వచ్చి
వెళ్ళిపోతున్నావ్

కొండనై నేనిక్కడే నిలుచుని
ఎదురుచూస్తున్నా
జలపాతమై పారుతూ వచ్చి
ప్రవాహమైపోతున్నావ్
చెట్టులా నేనిక్కడే నిలుచుని
ఎదురుచూస్తున్నా
కోయిలై వచ్చి పాటలా మారి
ఎగిరిపోతున్నావ్

అద్దమై నేనిక్కడే నిలుచుని
ఎదురుచూస్తున్నా
ప్రతిబింబమై కవ్వించి నవ్వుతూ
వెళ్ళిపోతున్నావ్

శిలలా నేనిక్కడే నిలుచుని
ఎదురుచూస్తున్నా
జీవమే నీవై
- క‌స్తూరి ఫ‌ణిమాధ‌వ్‌