ఇటీవల విడుదలైన 'కాంచన' సినిమాలో హిజ్రాగా నటించి, ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్న తమిళ నటుడు శరత్ కుమార్ ఆ సినిమా ప్రమోషన్ లో పాల్గొనడానికి హైదరాబాదు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, నేతాజీ సుభాష్ చంద్ర బోస్ పాత్ర పోషించాలన్నది తన చిరకాల కోరికని చెప్పారు. దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి చేసుకున్నాననీ, నేతాజీ జీవితంలోని ముఖ్య సంఘటనల సమాహారంగా ఇది ఉంటుందనీ చెప్పారు.
త్వరలోనే ఈ సినిమా సెట్స్ కు వెళుతుందనీ, దీనికి తానే దర్శకత్వం వహిస్తాననీ తెలిపారు. ఇదిలా ఉంచితే, కాంచన సినిమాలోని గెటప్ లో ఆయనని చూసిన భార్య రాధిక నవ్వాపుకోలేకపోయిందట. "ఇన్నాళ్లూ మీ వెంట అమ్మాయిలు పడ్డారు. ఇప్పుడు అబ్బాయిలు పడతారు... జాగ్రత్త" అంటూ కాంప్లిమెంట్ కూడా ఇచ్చిందట రాధిక.