శ్రీరామ రాజ్యంలో 'మచ్చ' వివాదం :CineJwala Telugu:

Posted on

ఒక సినిమా నిర్మించినప్పుడు దర్శక, నిర్మాతల మధ్య పలు విషయాల్లో అభిప్రాయబేధాలు వస్తుంటాయి. అయితే, ఇప్పుడొక 'మచ్చ' ఇలాంటి బేధాన్ని సృష్టించేలా వుంది. బాలకృష్ణ కథానాయకుడుగా బాపు దర్శకత్వంలో రూపొందుతున్న 'శ్రీరామ రాజ్యం' సినిమాలో సీతాదేవిగా నయనతార నటిస్తున్న సంగతి తెలిసిందే. నయనతారకు పై పెదవిపై ఓ పుట్టుమచ్చ వుంటుంది. ఇది తన బ్యూటీ స్పాట్ గా ఆమె ఫీలవుతూ వుంటుంది.
అయితే, సీతాదేవికి ఇలా వుండడం వల్ల ఆ పాత్ర పవిత్రతకు భంగం కలుగుతుందని నిర్మాత సాయిబాబా భావించి, ఆ మచ్చను పోస్ట్ ప్రొడక్షన్ సమయంలో కంప్యుటర్ గ్రాఫిక్స్ సహాయంతో తొలగించాలని ప్రపోజ్ చేశారట. అది తెలుసుకున్న దర్శకుడు బాపు నిర్మాత మీద అగ్గిమీద గుగ్గిలం అయ్యారని తెలుస్తోంది. ఆ మచ్చ వల్ల ఎటువంటి ఆక్షేపణా ఉండదనీ, అందువల్ల తొలగించాల్సిన అవసరం ఏమొచ్చిందనీ నిర్మాతను నిలదీశారట. మరి, ఇంతకీ నయనతార మచ్చ సినిమాలో ఉంటుందా? ఉండదా? అన్నది సినిమా రిలీజ్ అయితేనే కానీ తెలియదు.